– అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు సారథి న్యూస్, అనంతపురం: హిందూపురం రెడ్ జోన్లలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా, సామాజిక దూరం పాటించేలా రెడ్ జోన్లలో ఆటోల ద్వారా ప్రచారం చేయాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే టోల్ […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనాను సమష్టగా ఎదుర్కొన్నామని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో రెండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే జీరో అవుతాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వచ్చిందని, త్వరలో గ్రీన్ జోన్ కు వస్తుందని, ఉపాధిలో 28వేల మందికి పనులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం […]
సారథి న్యూస్, శ్రీకాకుళం : దేశ, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్, కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మీడియాకు వివరించారు. జిల్లాకు ఇప్పటివరకు విదేశాల నుండి 13,500 మంది వరకు వచ్చారని, వారు స్వచ్ఛందంగా సెల్ నం.94912 22122, 089422 40699 లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ఢిల్లీ, ముంబై తదితర […]
– స్వీయ రక్షణే అందిరికీ సేఫ్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ మెలిగితే చుట్టుపక్కల వారికి కూడా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చాలా చోట్ల రెడ్ జోన్స్ ను ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో స్థానికంగానే ఉంటూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని అంటున్నారు. రెడ్ జోన్స్ నుంచి […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్పష్టం చేశారు. సాయంత్రం జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటైన్ మెంట్ జోన్లలో డోర్ డెలివరీ సౌకర్యం పెంచాలని సూచించారు. కరోనా నియంత్రణలోజిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు చాలా శ్రమిస్తున్నారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రసూతి, […]