సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపోగు, జేఏసీ నాయకులు నాగరాజు, సురేష్ కోరారు. ప్రొఫెసర్ల జీతాలు చెల్లించకపోవడంలో యూనివర్సిటీ ఇన్‌చార్జ్ ఉపకుపతి ఎంఎం నాయక్ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంత మంది యూనివర్సిటీ అధికారులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్‌చార్జ్ ఉపకుపతిని తొలగించి, రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్చేశారు. […]