Breaking News

RATION RICE

రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న వాహనంలో తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. డ్రైవర్ అనిల్, ఓనర్ తిరుపతిని అదుపులోకి తీసుకుని వేములవాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు.

Read More
పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్​ బియ్యం

రేషన్​ బియ్యం పట్టివేత

సారథి న్యూస్​, హుస్నాబాద్: పేదల కోసం పంపిణీ చేయాల్సిన 10 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎల్లమ్మ బజార్ కాలనీలో గౌరిశెట్టి నర్సయ్య అనే వ్యక్తి తన ఇంట్లో రేషన్​బియ్యం నిలువచేశాడు. సమాచారమందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నర్సయ్య ఇంట్లో తనిఖీ చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై […]

Read More