సారథి న్యూస్, నిజాంపేట: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట పట్టణంలో జనజాగరణ ప్రారంభ పూజాకార్యక్రమం నిర్వహించారు. రామమందిర నిర్మాణానికి అయ్యే నిధుల సేకరణ కార్యక్రమానికి అందరి నుంచి అపూర్వ మద్దతు లభించింది. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బ సత్యనారాయణ, జిల్లా సహ సంయోజక్ బండి వెంకటేశ్వర్లు, రామాయంపేట సహ సంయోజక్ పుట్టి […]
న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగోళీని ట్వీట్ చేశారు. ఒక చిన్న గుడి ముందు ముగ్గుతో శ్రీరామ్ అని రాసిన ముగ్గు ఫొటోను ఆమె ట్వీట్ చేశారు. ‘చాలా ఇళ్లలో ప్రతిరోజు రంగోళీ, కోలమ్‌ను వేస్తారు. బియ్యంపిండితో ప్రతి రోజు ఫ్రెష్‌గా వేసుకుంటారు. మా ఇంటి దగ్గరలోని ఒక చిన్నగుడిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇలా వేశారు’ అని మంత్రి ట్వీట్ చేశారు. […]
అయోధ్య: దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలోని ఆలయాను, సరయూ నదీతీరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ అయోధ్యలో దాదాపు 3 గంటల పాటు గడపనున్నారు. బుధవారం ఉదయం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి స్పెషల్ చాపర్‌లో అయోధ్యకు వెళ్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన […]
ముంబై: అయోధ్యలో రామమందిరం నిర్మాణం శుభపరిణామమని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని చేతుల మీదుగా బుధవారం భూమిపూజ చేయాల్సిన మంచి క్షణం మరొకటి లేదని, శ్రీరాముని దయ వల్ల కరోనా కనుమరుగు అవుతోందని చెప్పింది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వయోభారం వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని చెప్పింది. అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారని, హోం మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోందని […]
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణం భూమి పూజకు రావాలని బాబ్రీమసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి సోమవారం తొలి ఆహ్వానపత్రిక అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరఫున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. తనను ఆహ్వానించడంపై అన్సారీ హర్షం వ్యక్తంచేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను..’ అని అన్సారీ అన్నారు.180 మందికి మాత్రమే ఆహ్వానంఈనెల 5న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో […]