సారథి, రామడుగు: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ రామడుగు మండల నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈటల త్వరగా కోలుకుని మళ్లీ హుజూరాబాద్ పాదయాత్ర పూర్తిచేయాలని ఆకాంక్షించారు. నాయకులు కట్ట రవీందర్, జేట్టవెని అంజిబాబు, మునిగంటి శ్రీనివాస్, డబులకార్ రాజు, నిరంజన్ ముదిరాజ్, జిట్టవేని రాజు, నీలం దేవకిషన్, ఉత్తేమ్ రాజమల్లు పాల్గొన్నారు.
ముదిరాజ్ సంఘం జిల్లా యువ నాయకుడు హరికృష్ణ సారథి, బిజినేపల్లి: మాజీమంత్రి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అండగా నిలుస్తుందని సంఘం జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ తెలిపారు. గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈటలను కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను కక్ష సాధింపుతో మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన […]
సారథి, హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజాఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఈటల అక్రమాస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఇళ్లపై ఐటీదాడులు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు […]