సారథి, బిజినేపల్లి: ఆర్ఏహెచ్– యాక్ట్ పథకంలో భాగంగా రాయితీపై లబ్ధిదారులకు గడ్డి కత్తిరించే యంత్రాలను మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన నలుగురు, లట్టుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఐదు గ్రామాలు లట్టుపల్లి, నందివడ్డేమాన్, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలు ఈ పథకానికి ఎంపికైనట్లు వివరించారు. ఈ […]
సారథి, బిజినేపల్లి: వాతావరణ మార్పులకు అనుసంధానంగా స్థిరస్థాపక కుటుంబాల అభివృద్ధి(ఆర్ఏహెచ్యాక్ట్) అనే పథకం ద్వారా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్, లట్టుపల్లి, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలకు చెందిన 231 మంది రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ చేశారు. వర్షాధారంగా రైతులకు ఎకరానికి సరిపడా ఒక పత్తి ప్యాకెట్ రెండు కేజీల కంది విత్తనాలు (4:1) నిష్పత్తిలో అంతరపంటగా వేసేందుకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల రైతు […]