సారథి న్యూస్, అలంపూర్: జూన్ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.
న్యూఢిల్లీ: ప్రతి రోజు యోగా చేసేవారికి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆయుష్ మినిస్టర్ శ్రీపాద నాయక్ అన్నారు. ఆదివారం యోగాడే పురస్కరించుకుని పీటీఐ వార్త సంస్థతో మాట్లాడిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం లభించిందని, అది కరోనాతో పోరాడేందుకు బాగా ఉపయోగపడిందని నేను కచ్చితంగా చెప్పగలను. యోగా చేసే వాళ్లు కరోనా బారిన పడటటం చాలా తక్కువ’ అని మంత్రి చెప్పారు. యోగా ఇమ్యూనిటీని పెంచుతుందని, […]