జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గవర్నర్తో కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ విమర్శించగా.. బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్ నేతలు […]