సారథి న్యూస్, రామాయంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా అతడికి రూ. 60 వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, ఎంపీటీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లండన్: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కాగా.. ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిపోతుందని సర్వేలో తేలింది. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ పార్ట్‌లోని యూఎన్‌యూ, డబ్యూఐడీఈఆర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కింగ్స్ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కూడా దీనిపై రిసెర్చ్ చేశాయి. లాక్‌డౌన్ కారణంగా […]