సారథి, పెద్దశంకరంపేట: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తీసుకున్న విత్తనాలను పరిశీలించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నాసిరకం విత్తనాలను అంటగడితే తమకు సమాచార ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.