Breaking News

PEDDASHANKARAMPET

అభివృద్ధి పనులపై ఎంపీడీవో సమీక్ష

అభివృద్ధి పనులపై ఎంపీడీవో సమీక్ష

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ ఎంపీపీ కార్యాలయంలో సమీక్షించారు. గ్రామాల్లో నర్సరీ పనులు నిర్వహణ, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం పనుల్లో పురోగతి..ఉపాధి హామీ పనులకు కూలీల సమీకరణ పెంపు తదితర విషయాలను చర్చించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్​, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More
అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సమాజంలోని ఎంతో మంది పేదలు, అన్యాయానికి గురైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించే గట్టు వామన్ రావు, అతని భార్యను దారుణంగా చంపివేయడం చాలా బాధాకరమని బ్రాహ్మణ సమాజం సేవా సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి, క్రిష్ణశర్మ, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రావు, రంగన్న, ఫణి, రాము, అనంత్ రాజ్, రవి, […]

Read More
అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్​చార్జ్ ​వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్​కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]

Read More
పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read More
‘జహీరాబాద్’లో బీజేపీ జెంగా ఎగరేస్తాం

‘జహీరాబాద్’లో బీజేపీ జెండా ఎగరేస్తాం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు నిరంతరం కృషిచేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ యాదవ్, […]

Read More
సేవలతోనే గుర్తింపు

సేవలతోనే గుర్తింపు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: విధి నిర్వహణలో ప్రజలకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని సంగారెడ్డి తపాలా శాఖ సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీ స్ బి.శ్రీనివాస్, పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్​కుమార్​అన్నారు. శనివారం పెద్దశంకరంపేట పోస్ట్​ఆఫీసులో చిలపల్లి బీపీఎం సుదర్శన్ రిటైర్డ్​మెంట్​కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 42 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తపాలాశాఖలో సేవలందించడం అమోఘమన్నారు. అనంతరం బీపీఎం సుదర్శన్​ను తపాలా సిబ్బంది ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో గంగారాం విజయ్ కుమార్, సాయిరాం, కృష్ణవేణి, రాఘవేందర్, నిరంజన్, శంకర్, సాయిగౌడ్ […]

Read More
‘డబుల్’ ఇండ్లకు భూమిపూజ

‘డబుల్’ ఇండ్లకు భూమిపూజ

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని ఇసుకపాయల తండా గ్రామంలో రూ.1.08 కోట్ల వ్యయంతో మంజూరైన 20 డబుల్ ​బెడ్​రూమ్ ​ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు విజయరామరాజు, టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు మురళీ పంతులు, సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ సభ్యులు, వీణా సుభాష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు […]

Read More