Breaking News

PEDDASHANKARAMPET

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

సారథి, పెద్దశంకరంపేట: బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండలంలోని ఉత్తులూర్ గ్రామానికి చెందిన సంగమ్మ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్ వోసీ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, వైస్ […]

Read More
లాక్ డౌన్ గీత దాటితే కఠినచర్యలు

లాక్ డౌన్ గీత దాటితే కఠిన చర్యలు

సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ జార్జ్ హెచ్చరించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో బయటికి వస్తున్న పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలని, 10 గంటల తర్వాత ఎవరైనా బయట […]

Read More
శతాధిక వృద్ధుడి మృతి

శతాధిక వృద్ధుడి మృతి

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని కమలాపూర్ కింది తండాకు చెందిన శతాధిక వృద్ధుడు పాపియా నాయక్(110) బుధవారం మృతిచెందాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చనిపోయాడు. శతాధిక వృద్ధుడు మృతి చెందడం పట్ల సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కమలాపూర్ సర్పంచ్ కుంట్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు, సంతాపం తెలిపారు.

Read More
కరోనాతో యువకుడి మృతి

కరోనాతో యువకుడి మృతి

సారథి, పెద్దశంకరంపేట: కరోనాతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జంబికుంట గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యువకుడు మంగళవారం ఉదయం స్థానిక  ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు పాజిటివ్ కేసులు ఒకేరోజు 25 మందికి పరీక్షలు చేయగా అందులో నాలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ […]

Read More
రూల్స్ పాటించని షాపులకు జరిమానా

రూల్స్ పాటించని షాపులకు జరిమానా

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా  విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]

Read More
రైస్ మిల్లు ప్రారంభం

రైస్ మిల్లు ప్రారంభం

సారథి: పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బొడగట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లును నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతో సదుపాయంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, రైస్ మిల్లు యాజమాన్యం కనకరాజు, కందుకూరి రవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read More
‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

సారథి, పెద్దశంకరంపేట: హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని తిరుమలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్దశంకరంపేట రామాలయం లో భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ పూజారి రంగాచారి ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జనగం శ్రీనివాస్, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, […]

Read More
‘పేట’ను వణికిస్తున్న కరోనా

‘పేట’ను వణికిస్తున్న కరోనా

నిన్న ఒకరు.. తాజాగా ఇద్దరు మృతి మరికొంత మందికి పాజిటివ్ గా నిర్ధారణ సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. కేసులు పెరుగుతుండడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన ఓ వ్యక్తి(48) హైదరాబాద్​ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈనెల21న పెద్దశంకరంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోగా, అతనికి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ […]

Read More