Breaking News

PEDDASHANKARAMPET

హరితహారంను విజయవంతం చేయాలి

హరితహారంను విజయవంతం చేయాలి

సారథి, పెద్దశంకరంపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయాశాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Read More
నర్సరీల పరిశీలన

నర్సరీల పరిశీలన

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని బూరుగుపల్లి, కొలపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను ఈజీఎస్ ఏపీవో సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ […]

Read More
కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

సారథి, పెద్దశంకరంపేట: ఇటీవల కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ఆర్ఎస్ఎస్ నిరుపేద కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు సేవాభారతి ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సీతారామారావు, రవివర్మ, సతీష్ గౌడ్, జైహింద్ రెడ్డి, సర్వేశ్వర్, కృష్ణమూర్తి, విశ్వేశ్వర్ గౌడ్, శ్రీహరి, మధు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Read More
చేసిన సేవలతోనే గుర్తింపు

చేసిన సేవలతోనే గుర్తింపు

సారథి, పెద్దశంకరంపేట: విధినిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవలు ఎంతో గుర్తింపునిస్తాయని సంగారెడ్డి డివిజన్ తపాలాశాఖ మెయిల్ వర్షన్ శ్రీనివాస్, పెద్దశంకరంపేట ఎస్ పీఎం అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట తపాలా శాఖ కార్యాలయంలో జీడీఎస్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన సాయగౌడ్ ను సిబ్బంది సన్మానించారు. తపాలాశాఖలో 42 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగులంతా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని […]

Read More
టీఆర్ఎస్ లో పలువురి చేరిక

టీఆర్ఎస్ లో పలువురి చేరిక

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం దానంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ ఉపసర్పంచ్ కొడుకు కట్ట శంకర్, పంచాయతీ కోఆప్షన్ సభ్యుడు పుట్ల బేతయ్య, కట్ట చిన్నరవి, కట్ట వెంకయ్య, కట్ట లింగయ్య, నర్సింగ్, శివకుమార్, సాయిలు, యాదయ్య, యాదమ్మ, శ్రీకాంత్, దుర్గయ్య, గంగయ్య సతీష్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీపీ […]

Read More
ప్రజాసమస్యల పరిష్కారానికే నిధులు

ప్రజాసమస్యల పరిష్కారానికే నిధులు

సారథి, పెద్దశంకరంపేట: ఎంపీపీ నిధులను ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు ఆదివారం వినతిపత్రం అందజేసినట్లు ఎంపీపీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజాపరిషత్ కు కేటాయించిన 15 ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ఇప్పటి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మంత్రికి మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు […]

Read More
ధాన్యం లోడును త్వరగా ఖాళీచేయాలి

ధాన్యం లోడును త్వరగా ఖాళీచేయాలి

మెదక్ ఆర్డీవో సాయిరాం సారథి, పెద్దశంకరంపేట: లారీల్లోని ధాన్యం లోడును వెంటనే ఖాళీచేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ముందుగా స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాంలోకి వెళ్లి చూశారు. నిర్ణీత వ్యవధిలోనే సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. వచ్చేనెల బియ్యం డబుల్ కోటా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గోదాం ఇన్ చార్జ్ ప్రదీప్ కుమార్ కు […]

Read More