Breaking News

PEDDASHANKARAMPET

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండల ఖండ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. పర్యావరణ ప్రముఖ్ గా రవివర్మ, ఖండ వ్యవస్థ ప్రముఖ్ గా వీరప్ప, ఖండ కార్యవాహ్ గా జహిందర్ రెడ్డి, సహ కార్యవాహ్ గా సీతారామరావు, సంపర్క్ ప్రముఖ్ గా కృష్ణమూర్తి, బౌద్ధిక్ ప్రముఖ్ గా సర్వేశ్వర్, ఖండ ముఖ్యకార్యకర్తగా సతీష్ గౌడ్, సేవా ప్రముఖ్ గా విశ్వేశ్వర్ గౌడ్, ఖండ కార్యకర్తగా మల్గొండ మధును నియమించారు.

Read More
అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా జడ్పీ సీఈవో వెంకట శైలేష్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, మాడ్ శెట్ పల్లి గ్రామాల్లో వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. వీలైనంత తొందరగా వైకుంఠధామం పనులు, కంపోస్టు ఎరువుల తయారీ తదితర పనులను పూర్తిచేయాలని కోరారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ […]

Read More
క్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి నుంచి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న12 లేగ దూడలను అల్లదుర్గం సీఐ జార్జ్, పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ కలిసి బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రామోజీపల్లి అటవీ ప్రాంతంలో 30లేగ దూడలను తరలించేందుకు పలువురు వ్యక్తులు కట్టివేసి ఉంచారని, అందులో 12 లేగ దూడలను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయంపై కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలను తరలిస్తే కఠినచర్యలు […]

Read More
ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

నిర్వహణపై అధికారుల తీరు మారాలి గ్రామాల్లో పనులను పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​ సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలోని జాంబికుంట, ఆరెపల్లి, కమలాపూర్, బుజ్రన్ పల్లి, కొల్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరేపల్లిలో గోతుల్లో మొక్కలు ఉండకుండా, కలుపు మొక్కలు పెరగడంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ […]

Read More
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి, పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జొన్నలు క్వింటాలుకు రూ.2,620 చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తోందన్నారు. దేశంలోనే […]

Read More
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాతా

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాతా

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కొత్తపేట, రామోజీపల్లి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కోఆర్డినేటర్​కొమ్ముల శేఖర్ గౌడ్, నాగరాజు, సాయిలు, శ్రీనివాస్, మదన్, మాధవి, రవీందర్, రాజు నాయక్ కళాజాతా నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, కరోనా వ్యాప్తిపై జాగ్రత్తలు, సూచనలు, వ్యాక్సినేషన్, మాస్క్ ప్రాధాన్యత, ఆరోగ్యం, హరితహారం, పల్లెప్రగతి, నూతన వ్యవసాయ పద్ధతులపై తమ ఆటాపాటల ద్వారా గ్రామస్తులకు […]

Read More
జోరుగా ఏరువాక

జోరుగా సాగిన ఏరువాక

సారథి, పెద్దశంకరంపేట/రామాయంపేట: ఏరువాక గురువారం జోరుగా సాగింది. పౌర్ణమి సందర్భంగా రైతులు ఎడ్లబండ్లు, నాగళ్లను మువ్వలు, వివిధ అలంకరణలు చేసి పొలం బాటపట్టారు. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో రైతన్నలు ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ శుభదినాన రైతులు, అన్నదాతలకు సిరులపంట పండుతుందని విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధపౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. పండుగ రోజున ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, […]

Read More
బతుకుదెరువు కోసమొస్తే ఊపిరి ఆగింది

బతుకుదెరువు కోసమొస్తే ఊపిరి ఆగింది

సారథి, పెద్దశంకరంపేట: బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా డోన్​నుంచి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో బుధవారం జరిగింది. ఎస్సై నరేందర్ కథనం.. డోన్​కు చెందిన దూదేకుల షేక్ షావలీ(45) పొట్టకూటి కోసం పెద్దశంకరంపేట్ వచ్చి తాపీమేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో తోటికార్మికుడు జయరాములు ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మెదక్ రోడ్డులో పక్కనే కుప్పకూలిపోయాడు.. సంగారెడ్డిలో ఉంటున్న అతని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]

Read More