సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ సుక్క చిన్నబోయింది. ఆకలికి చిక్కిపోయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ ప్రస్తుతం నిరాడంబర […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కంటైన్ మెంట్ జోన్ లో లాక్ డౌన్ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. సోమవారం పాతపట్నంలో పర్యటించిన ఆయన స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే గృహనిర్బంధంలోనే ఉండాలన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి టీవీఎస్ జీ కుమార్, తహసీల్దార్లు పి.రమేష్ బాబు, సురేష్, కాళీప్రసాద్ […]