సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్ కటుకం రవీందర్‌కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, […]
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ బన్సీలాల్ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్ కమ్ములకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.