Breaking News

PANYAM

డ్యూటీపై నిర్లక్ష్యం వద్దు

డ్యూటీపై నిర్లక్ష్యం వద్దు

సారథి న్యూస్​, కర్నూలు: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ–2( అభివృద్ధి) రాంసుందర్‌ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) రామసుందర్‌రెడ్డి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి తదితరులతో కలిసి నంద్యాల, పాణ్యంలోని సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏకలవ్య నగర్‌లోని సచివాలయం, పాణ్యం మండలంలోని పాణ్యం–4 సచివాలయం, పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి […]

Read More
రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్​

రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్​

సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం సమావేశ భవనంలో వైఎస్సార్​ ఉచిత విద్యుత్‌ పథకంపై డివిజన్‌ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల సబ్​ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్​ను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్​ ఉచిత విద్యుత్​ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను […]

Read More
మహిళలకు అండగా ‘వైఎస్సార్​చేయూత’

మహిళలకు అండగా ‘వైఎస్సార్​ చేయూత’

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ​ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డ్, పోర్త్​క్లాస్ ఎంప్లాయీస్​ కాలనీలో ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా వచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసుకున్న కిరాణ షాపును నగరపాలక సంస్థ కమిషనర్​ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీకే బాలాజీ ప్రారంభించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వైఎస్సార్​చేయూత పథకాన్ని […]

Read More
పారదర్శకంగా ఇంటిస్థలాల కేటాయింపు

పారదర్శకంగా ఇంటిస్థలాల కేటాయింపు

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పట్టాల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా అమలుచేయాలని కర్నూలు మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ స్పష్టంచేశారు. సోమవారం ఆన్ లైన్ విధానంలో లబ్ధిదారులకు లేఅవుట్ స్థలాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్​ సుధాకర్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద మొత్తం […]

Read More
రూ.1.8 కోట్ల నగదు సీజ్​

రూ.1.8 కోట్ల నగదు సీజ్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల టోల్ గేట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.1.80 కోట్ల నగదును పాణ్యం పోలీసులు శుక్రవారం సీజ్​చేశారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును ఇన్​కంటాక్స్​అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. నగదును తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ ను విచారించగా హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పాడని పాణ్యం సీఐ జీవన్ గంగానాథ్​బాబు తెలిపారు.

Read More