సారథి, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందిగామ, నస్కల్, నిజాంపేట గ్రామాల పంచాయతీ సిబ్బంది, సఫాయి కార్మికుల వేతనాలు పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామయంపేట ఉమ్మడి మండలం సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందని కానీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం సరికాదన్నారు. మినిమం బేసిక్ పే […]