హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వాసులను వణికించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, మీర్‌పేట, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పాతబస్తీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల […]