న్యూజిలాండ్: హోం క్వారంటైన్లో ఉన్న ఓ కరోనా రోగి మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సాహసమే చేశాడు. ఇనుపకంచెను తెగ్గొట్టి దాని దాటుకుంటూ వెళ్లి మద్యం కోనుగోలు చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకున్నది. న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి(52) కి ఇటీవల కరోనా సోకగా.. అక్కడి ప్రభుత్వమే అతడిని హోంక్వారంటైన్లో ఉంచింది. క్వారంటైన్ కేంద్రం చుట్టూ భారీ ఇనుపకంచెలు కూడా ఏర్పాటు చేశారు. కాగా అందులో ఉంటున్న ఓ కరోనా రోగి మందు తాగాలనిపించంది. […]