ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం లక్నో: స్వర్గీయ సీడీఎస్చీఫ్జనరల్ బిపిన్ రావత్ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 69,652 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు 20,96,664 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,794 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు 53,866 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 6,86,395 మంది చికిత్స పొందుతున్నారు.
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పురాతన భవనమని, భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ‘ఈ భవనాన్ని 1921 […]
న్యూఢిల్లీ/భువనేశ్వర్: చారిత్రక జగన్నాథ రథయాత్రను ఈ సారి నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూన్ 23 నుంచి ఒడిశాలోని పూరిలో రథయాత్ర ప్రారంభం కావలసి ఉన్నది. కాగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్రను నిలిపివేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రథయాత్రకు అనుమతిస్తే భారీగా ప్రజలు గుమిగూడతారని స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతి వాదించారు. ఇతడి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రథయాత్రను నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూరీ […]