నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి, పెద్దశంకరంపేట: పల్లె ప్రగతి పనులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అందుకోసం ప్రజలంతా సమష్టిగా కృషిచేయాలని కోరారు. ఆదివారం ఆయన మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో మహిళా సంఘాల సభ్యులకు మొక్కలు అందజేశారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించడం, మురికి కాల్వలను శుభ్రంచేయడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. […]
సారథి, పెద్దశంకరంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోరా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోలు ఉమాసంగమేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేకపూజలు జరిపించారు. ఆయన వెంట పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్, మల్లేశం, సుధాకర్, రాజేశ్వరి […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు పెద్దశంకరంపేట మండలంలో విశేష స్పందన లభిస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలతో పాటు నగదును పార్టీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అందజేశారు. మండలంలో దాదాపు ఐదువేలకు పైగా సభ్యత్వ నమోదు చేశామని, అందులో ఇప్పటివరకు 2500 సభ్యత్వాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. […]
సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: కాలం మారుతున్నా కొద్దీ యాంత్రిక శక్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వ్యవసాయ పొలంలో దుక్కులు దున్నేకాడి నుంచి పంటను తీసుకెళ్లే వరకు ప్రతిపనిలో యంత్రాలు, ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు పాతకాలం నాటి పద్ధతులనే వాడుతున్నారు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో యూరియా, డీఏపీ మందు సంచులు, సేంద్రియ ఎరువులను […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(బీ) పంచాయతీలో సీసీరోడ్డు పనులను సర్పంచ్ సాయవ్వ మనోహర్, ఎంపీటీసీ ఇందుమతి మారుతీ శనివారం ప్రారంభించారు. రూ.ఐదులక్షల వ్యయంతో 170మీటర్లు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తామన్నారు. బాలాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్: కురుమల ఆరాధ్యదైవమైన బీరప్ప అడుగుజాడల్లో నడవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని ఆబ్బెంద గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప, మహా లింగ్ రాయ విగ్రహాలు ప్రతిష్ఠాపన, కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయనకు కురుమలు సంప్రదాయ పద్ధతిలో డోలు వాయిస్తూ, నృత్యాల మధ్య స్వాగతం పలికారు. కురుమలు మాట తప్పరని సీఎం కేసీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర సర్కార్ నియంత్రిత పంటసాగు విధానం ద్వారా రైతులు పత్తి, కంది పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించిన కొద్దిరోజులకే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని పలు మండలంలో నకిలీ పత్తి విత్తనాలు దందా జోరుగా కొనసాగుతోంది. నారాయణఖేడ్ మండలంలోని ఆబ్బెంద గ్రామం, కంగ్టి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గోకులకృష్ణ సీడ్స్ పేరుతో నాసిరకం పత్తి విత్తనాలు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్పీ లేకుండా ఉన్న […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను కొనడం లేదని మంగళవారం కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామరైతులు స్థానిక అగ్రికల్చర్ ఆఫీసు ఎదుట ధర్నాచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని గొప్పలు చెప్పి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి చివరకు చేతికి వచ్చేసరికి కొనడం లేదన్నారు. అనంతరం మార్కెటింగ్‌శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి, మారుతిరెడ్డి, సంజీవ్, గోపాల్ పాల్గొన్నారు.