నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. కేతికశర్మ హీరోయిన్. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్లో ఇది 20వ సినిమా. అయితే నిర్మాతల్లో ఒకరైన నారాయణదాస్ కె.నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లుక్‌ను ఆవిష్కరించారు. ‘అశ్వత్థామ’ సినిమాతో మాస్ ఇమేజ్‌కు మారిన నాగశౌర్య ఈ […]
‘అశ్వత్థామ’ సినిమాతో రఫ్ హీరోగా దర్శనమిచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు లుక్ ను మరింత రఫ్ చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం శౌర్య చేసిన వర్క్అవుట్స్ తన లుక్, కటౌట్‌ను మార్చేశాయి. ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటుచేసుకుని కఠోర వ్యాయామాలు చేశాడు. వావ్ అనిపించుకునే కండలు తిరిగిన దేహంతో అభిమానులను అబ్బురపరిచాడు. ‘ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ ఈ చిత్రంలో నాగశౌర్యకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేసింది […]