Breaking News

NAGARKURNOOL

పేదల విద్యా‘సౌభాగ్యం’

పేదల విద్యా‘సౌభాగ్యం’

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఔదార్యం తాడూరు ప్రభుత్వ జూనియర్​ కాలేజీకి రెండెకరాల భూదానం తన సతీమణి స్మారకార్థం విద్యాభివృద్ధికి శ్రీకారం సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక సారథి, నాగర్​కర్నూల్: పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత కారణంగా చాలా పేదపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోడంతో ఎంతోమంది ఆడబిడ్డలు చిన్నతనంలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. చదువులకు పేదరికం అడ్డకాకూడదని, పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి గొప్పగా రాణించాలని […]

Read More
బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్తే..

బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్తే..

ఆర్ఎంపీ వచ్చీరాని ట్రీట్​మెంట్​ పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి తల్లిదండ్రులతో గోప్యంగా బేరం సామాజిక సారథి, బిజినేపల్లి: వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందిన సంఘటన విషాదకర సంఘటన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని ఓ గిరిజన తండాలో గురువారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. తండాకు చెందిన బాలుడు(11) మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బిజినేపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వైద్యం కోసం తీసుకెళ్లారు. అతను వచ్చీరాని […]

Read More
కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ సారథి, బిజినేపల్లి: కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను హరించివేయడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. మోడీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టాక కరోనా వైరస్ కారణంగా దేశం ప్రజలు బెంబేలెత్తిపోతున్నా ఏమీ పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల […]

Read More
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

సారథి, నాగర్​కర్నూల్: జిల్లాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహణపై బుధవారం జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్​వో) డాక్టర్​ సుధాకర్​లాల్ ​వైద్యాధికారులతో జూమ్​ మీటింగ్ ​నిర్వహించారు. చిన్నారులను గుర్తించి సకాలంలో బీసీజీ టీకాలు వేయాలని సూచించారు. తదుపరి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్ఎంఐఎస్ ​ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని అన్నారు. టెలీమెడిసిన్ విధానాన్ని రోగులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో […]

Read More
ఈ టైంలో కృష్ణానదిలోకి వెళ్లొద్దు.. ఎందుకంటే?

ఈ టైంలో కృష్ణానదిలోకి వెళ్లొద్దు.. ఎందుకంటే?

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల కృష్ణానది తీర ప్రాంతాలను సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై బాలవెంకటరమణ, సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. సోమశిల కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున బోటింగ్ చేయడం, చేపలవేటకు వెళ్లడం, పర్యాటకులు నది నీటిలోకి దిగడం వంటి పనులు చేయకూడదని సూచించారు. ఈ సూచనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని […]

Read More
తేమ పేరుతో దోపిడీ చేసిన్రు

తేమ పేరుతో దోపిడీ చేసిన్రు

20.80 క్వింటాళ్ల వరి ధాన్యం డబ్బులు నష్టపోయా.. ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి సోషల్​ మీడియా ద్వారా ఓ రైతు ఏకరువు సారథి, బిజినేపల్లి: తేమ సాకుతో తనను నిలువునా దోపిడీ చేశారని ఓ రైతు ఆక్రందన వ్యక్తం చేశాడు. తన బాధను సోషల్​మీడియా ద్వారా గురువారం నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కలెక్టర్​ ఎల్.శర్మన్​కు విన్నవించారు. తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరాడు. తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు. ‘నా పేరు […]

Read More
బక్రీద్.. ముబారక్​

బక్రీద్.. ముబారక్​

సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లాలో ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈద్గాలు, మసీద్ ల్లో ప్రత్యేక నమాజు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామామసీద్ తోపాటు అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

Read More
బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి

సారథి, నాగర్​కర్నూల్: ముస్లింల పవిత్ర బక్రీద్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం పండుగ కావడంతో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిస్తే నమాజ్​కు ఇబ్బందులు తలెత్తకుండా మసీదుల్లోనే ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాకు పెయింటింగ్ వేయించడంతో పాటు ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు. స్టోన్​డస్ట్​పోసి బురదను సరిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జామా మసీద్​ను […]

Read More