స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆహ్వానం అందుకున్న సినీతారలంతా దిల్ రాజు సదనానికి విచ్చేసి విందులో పాల్గొన్నారు. ఆయనతో అందరికీ అవసరమే మరి. ఈ వేడుక పక్కన పెడితే అభిమాన హీరోలంతా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ప్రాణ మిత్రుల్లా కనిపించడంతో ఫ్యాన్సంతా యమ ఖుషీ అయిపోతూ వాళ్ల ఫొటోలను షేర్ చేసే సందడిలో పడ్డారు. వాళ్లెవరో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్.. మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్ లవ్ స్టోరీని రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ లో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత కూడా ఓ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నాన్నంటూ ప్రకటించింది. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరో వైపు స్వచ్ఛంద సంస్థను కూడా నిర్విహిస్తోంది. ఆల్రెడీ సమంత తన రంగంలో మొదటి మెట్టుపై ఉంది. అలాగే మోడలింగ్ లో పలు బ్రాండ్ యాడ్స్ లో కూడా నటించింది. ఇప్పుడు సొంతంగా ఓ ఫ్యాషన్ వరల్డ్ ను […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్‌టైనర్’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి […]