సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]
సారథి న్యూస్, నంద్యాల(కర్నూలు): కృష్ణానది జలాల్లో రాయలసీమకు తీవ్రఅన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జేఏసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణానది జలాల్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదన్నారు. నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.203 పేరుతో రాయలసీమను […]