సారథి న్యూస్, మెదక్: ధరణి పోర్టల్ పనితీరును మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం కౌడిపల్లిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం అందుబాటులోకి తెచ్చిన పోర్టల్ ద్వారా కేవలం 15 నిముషాల్లోనే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవుతుందన్నారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పట్టా […]