సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి. తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, […]
సారథి, ములుగు: అడవులను కాపాడుకుందామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వనాల్లో మొక్కల సర్వేవాల్ రేటు పెంచేలా చూడాలని సూచించారు. హరితహారం మొక్కలను రెడీ చేయాలన్నారు. కోరిన విధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగ్ తప్పనిసరి సూచించారు. రైతుల అభీష్టం మేరకు ఆయిల్ ఫామ్, మామిడి ఫామ్ మొక్కలను ఇచ్చేందుకు ప్లాన్ చేయాలని కోరారు. కంటైన్మెంట్ల జోన్లలో […]
సారథి ప్రతినిధి, ములుగు: అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి స్వగ్రామం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె వెంట కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా […]