సారథి న్యూస్, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి సోమవారం మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో పోటీచేసి రెండవ స్థానంలో నిలిచారు. ఆయన వెంట పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఫార్మాసిటీని అడ్డుకుంటామని భట్టి మాట్లాడుతున్నారు.. ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఎదురుచూస్తోంది. మొన్నటి దాకా కాళేశ్వరం అడ్డుకుంటామని […]