సారథి న్యూస్, విజయనగరం: నైరుతి పవనం వచ్చేసింది.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలో భారీవర్షం కురిసింది. కొంతకాలంగా ఉదయం నుంచి విరుచుకుపడిన భానుడు ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకోగా మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీవర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్పొరేషన్ ఆఫీసు జంక్షన్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది. […]