సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన మోడల్ డెయిరీఫామ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ములుగు మండలంలోని పేదలను గుర్తించి వారికి గేదెలను పంపిణీచేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్సీ కార్పొరేషన్, జిల్లా పశుసంవర్థక అధికారి, జిల్లా ప్రణాళికాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కే […]