Breaking News

MLA SITHAKKA

మావోయిస్టు నేత హరిభూషణ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

హరిభూషణ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ ఆలియాస్ యాప నారాయణ ఇటీవల కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామంలో హరిభూషణ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క గురువారం పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆమె వెంట గంగారం, కొత్తగూడ మండలాల ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, విజయ రూపుసింగ్, జడ్పీటీసీలు ఈసం రామ సురేష్ , పుష్పలత శ్రీనువాస్. వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర […]

Read More
ఎమ్మెల్యే సీతక్క గొప్ప సాయం

ఎమ్మెల్యే సీతక్క గొప్ప సాయం

సారథి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం చాటుకున్నారు. ఇటీవల మరణించిన కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కైసర్ పాషా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే గరా రాములు కుటుంబానికి రూ.రెండువేల చొప్పున సాయం చేశారు. అలాగే కరోనాతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ […]

Read More
ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం

ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం

సారథి ప్రతినిధి, ములుగు: ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గుర్రంపేటలో సుమారు 130 కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక్కపూట తిండికి కూడా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఆకలి తీర్చడం కోసం కనీసం ముఖ్యమంత్రి ఆలోచించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతినెలా ప్రతి పేద కుటుంబానికి రూ.ఆరువేల […]

Read More
ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య […]

Read More
వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

సారథి, తాడ్వాయి: కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 30 మంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలను శాలువాతో ఘనంగా సన్మానించి చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ఇలాంటి […]

Read More
ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు

ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు

సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ […]

Read More
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

మాజీమంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

సారథి ప్రతినిధి, ములుగు: అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ ​కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి స్వగ్రామం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె వెంట కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా […]

Read More
పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]

Read More