బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ నేత రామ్‌గోపాల్, ఐఎన్‌టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్, […]
సారథి న్యూస్, గోదావరిఖని: బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జాతీయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జీఎం కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులు మెండ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు వై. గట్టయ్య, మేరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.