సారథి న్యూస్, హైదరాబాద్: ఆరేండ్ల మూడు నెలల పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే పెరిగి చదువుకున్నానని.. ఎర్రమంజిల్‌లో ఉంటూ జలమండలి ఆఫీసు […]