తెలంగాణ, మెదక్, లోకల్ న్యూస్ మహిళ మృతి.. ఎగిరిన ఇంటి పైకప్పు రేకులు రెక్కల కష్టం నీటిపాలు సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీవర్షం కురిసింది. గాలి దుమారానికి ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడి బలమైన గాయం కావడంతో ఓ మహిళ మృతిచెందింది. ఆయా ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ధాన్యం తడిసిపోయింది. మెదక్ పట్టణంలో బలమైన గాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు […]
సారథి న్యూస్, మెదక్: కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి రైస్ మిల్లర్లు అదనపు హమాలీలను సమకూర్చుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపురం మండల కేంద్రంతో పాటు రామాయంపేట మండలాల్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యం ఆయా మిల్లు వద్ద దిగుమతి కాకుండా అలాగే ఉంటునట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. […]
కూలి రూ.237గా నిర్ణయించిన కేంద్రం గతేడాది కంటే రూ.26 అదనంగా పెంపు సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూలీ కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించారు. కూలీలు పని ప్రదేశంలో సామాజిక దూరం పాటించేలా, అందరూ మాస్కు లు […]
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేస్తుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి లోని నాలుగో అంగన్ వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బియ్యం, కోడిగుడ్లు, నూనె, బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ […]