Breaking News

MEDAK DMHO

కరోనా టెస్టులు చేయించుకోండి

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్​ జిల్లా కంగ్టి పీహెచ్​సీ డాక్టర్​ మనోహర్​రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్​సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్​ గా​ నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్​లో ఉండాలని ఆయన సూచించారు.

Read More

పీహెచ్​సీ ఆకస్మిక తనిఖీ

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీని రాష్ట్ర కోవిడ్​ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పీహెచ్​సీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎన్ని పాజిటివ్​ వచ్చాయి తదితర వివరాల గురించి రాష్ట్ర బృందం ఆరా తీసింది. డాక్టర్​ ప్రభావతి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పీహెచ్​సీ రికార్డులను పరిశీలించింది. కార్యక్రమంలో పీహెచ్​సీ సిబ్బంది భూమయ్య, రామ్మోహన్​, విజయభాస్కర్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
చిన్నశంకరంపేటలో ఏడు కొత్తకేసులు

చిన్నశంకరంపేటలో 7 కొత్తకేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో శుక్రవారం 7 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్​ వచ్చిందని వైద్యులు తెలిపారు. గవ్వలపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా, రుద్రారం గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మండలంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని […]

Read More
రక్తదానం గొప్ప కార్యం

రక్తదానం గొప్ప కార్యం

సారథి న్యూస్, నర్సాపూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెదక్​ డీఎంహెచ్​వో డాక్టర్​ వెంకటేశ్వర్లు అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు కౌడిపల్లి పీహెచ్​లో గురువారం రక్తదానం చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. చాలా మంది గర్భిణులు రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో విజయనిర్మల, పీహెచ్​సీ డాక్టర్ వెంకటస్వామి, శోభన, సర్పంచ్​లు వెంకటేశ్వర్ రెడ్డి, శోభ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Read More