న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా, సామర్థ్యం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. దానికి తగినట్లుగానే విరాట్ ఆటతీరును పూర్తిగా మార్చేసుకుంటాడన్నాడు. ఏ మ్యాచ్ అయినా నిజాయితీగా ఆడటమే కోహ్లీ అతిపెద్ద బలమని చెప్పాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న పట్టుదల, ఆసక్తి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. దానికోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ఇంతలా కష్టపడే క్రికెటర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. […]