మాంచెస్టర్: డోపింగ్ కు పాల్పడిన వారిని, మ్యాచ్ ఫిక్సర్లను ఎలాగైతే శిక్షిస్తున్నారో.. జాతి వివక్షకు పాల్పడిన వారిని కూడా అదే తరహాలో దండించాలని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. అప్పుడైతేనే ఈ వివక్షల నుంచి క్రికెట్‌ను కాపాడిన వారవుతామన్నారు. ‘డోపర్లు, మ్యాచ్ ఫిక్సర్లు, రేసిస్ట్లు ఒకే కోవకు చెందుతారని నేను భావిస్తున్నా. వీళ్లకు శిక్షలు కూడా ఒకే రకంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా.. కఠినంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ల వల్ల క్రికెట్లో ఎలాంటి సమస్యలు […]