ఫొటోలకు ఫోజులు వద్దు.. పనులు చేయండి ప్రజలను భాగస్వాములు చేయండి జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సారథి, మానవపాడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కోరారు. బుధవారం మానవపాడు ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్ […]