Breaking News

MANAVAPADU

నడిగడ్డలో కాషాయం జెండా ఎగరడం కాయం

నడిగడ్డలో కాషాయం జెండా ఎగరడం కాయం

సారథి, మానవపాడు: నడిగడ్డలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ మానవపాడు మండలాధ్యక్షుడిగా గొల్ల విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే భారీఎత్తున జిల్లాలో చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని విజయ్​ […]

Read More
అపోహలు వీడి టీకా వేయించుకోండి

అపోహలు వీడి టీకా వేయించుకోండి

సారథి, మానవపాడు: మానవపాడు సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి కరోనా టీకా వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆత్మ లింగారెడ్డి కోరారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్​ సవిత, హెల్త్ సూపర్ వైజర్ చంద్రన్న, ఫార్మసిస్ట్ తీరుమల్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఏఎన్​ఎం మున్ని, షాజహాన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సోని, ఆశా వర్కర్లు ఉన్నారు.

Read More
మొక్కబడి మీటింగ్​లు ఎందుకు?

మొక్కబడి మీటింగ్​లు ఎందుకు?

ఆగ్రహం వ్యక్తంచేసిన సభ్యులు ఎంపీటీసీల పాత్ర ఉత్సవ విగ్రహాలే హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు సారథి న్యూస్​, మానవపాడు: రేషకార్డులు రాలే, మూడేళ్లు గడిచినా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాకపోతే గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉండి ఏమి చేయాలని ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం ఎందుకోసమని, సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ […]

Read More
ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ​పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభివాణి దేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత తిరుపతయ్య పట్టభద్రులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలం, పల్లెపాడు, బోరవెల్లి, చండూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల […]

Read More
శివనామస్మరణం

శివనామస్మరణం

వైభవంగా శివనారాయణ స్వామి జాతర భక్తుల తాకిడితో కిటకిటలాడిన ఆలయం సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలయోగి శివనారాయణ స్వామి జాతర ఉత్సవం కన్నులపండువగా సాగింది. రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనంలో భక్తులు తరించిపోయారు. ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 12 మంది దంపతులు లోకకల్యాణార్థం స్వామివారి కల్యాణం జరిపించారు. ఈ మహోత్సవానికి […]

Read More
రెండు చుక్కలతో నిండు జీవితం

రెండు చుక్కలతో నిండు జీవితం

సారథి న్యూస్, మానవపాడు: మండలంలో నిర్వహించిన పల్స్​పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ సౌజన్య అన్నారు. మానవపాడు మండలంలో 4,892 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వివరించారు. మండలం పరిధిలో 33 పోల్స్ పోలియో బూత్​లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక మొబైల్ టీమ్ ద్వారా పోలియో చుక్కలను వేశామన్నారు. రెండురోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అధికారులు చంద్రన్న సత్యనారాయణ, సంధ్యారాణి, తిరుమల్, ఆరోగ్యశ్రీ […]

Read More
ఉద్యోగులకు సీపీఎస్​శాపం

ఉద్యోగులకు సీపీఎస్​ శాపం

సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ ​జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్​ ఆఫీసర్ ​శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ ​రవికుమార్ ​చేతులమీదుగా టీఎస్​సీపీఎస్ ఈయూ క్యాలెండర్​ను ఆవిష్కరించారు. సీపీఎస్​ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ ​చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. […]

Read More
‘పరిహారం ఇవ్వకుండా..పైప్​లైన్​వేయొద్దు’

‘పరిహారం ఇవ్వకుండా.. పైప్​లైన్​ వేయొద్దు’

సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్​పీసీఎల్​ గ్యాస్ ​పైప్​లైన్​వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్​లైన్​ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

Read More