Breaking News

MALLIKARJUNASWAMY

ఘనంగా పల్లకీ సేవ

ఘనంగా పల్లకీ సేవ

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. తగిన జాగ్రత్తలతో భౌతికదూరం పాటిస్తూ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించామని ఈవో రామారావు తెలిపారు.

Read More
మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్​జస్టిస్​

మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్​జస్టిస్​

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్​కె.ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ శెట్టి, ఈవో రామారావు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారి మహామంగళ హారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం వ్యూ పాయింట్​నుంచి శ్రీశైలం జలాశయం, పరిసర ప్రకృతి అందాలను తిలకించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి […]

Read More
శ్రీశైలంలో దర్శనాలు ప్రారంభం

శ్రీశైలంలో దర్శనాలు ప్రారంభం

సారథి న్యూస్​, కర్నూలు​: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి దర్శనాలను ప్రారంభించినట్టు దేవస్థాన ఈవో కేఎస్​ రామారావు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆలయానికి రావొద్దని సూచించారు. క్యూలైన్లలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. శుక్రవారం స్థానికులకు దర్శనాలకు అవకాశం కల్పించామని.. శనివారం నుంచి దూరప్రాంతాల వారు రావొచ్చని సూచించారు. ఆలయసిబ్బందికి కరోనా రావడంతో కొంతకాలం క్రితం దర్శనాలను నిలిపివేశారు.

Read More
శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్​సైట్​లో దర్శన టికెట్లు బుక్​చేసుకోవాలని ఈవో తెలిపారు

Read More