సారథిన్యూస్, రామాయంపేట: నియంత్రిత పంటసాగులో భాగంగా ఈ ఏడాది పత్తిపంటకు అధికప్రాధాన్యమిస్తున్నామని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ పేర్కొన్నారు. గత ఏడాది మొక్కజొన్న సాగుచేసిన పొలాల్లో ఈ ఏడాది పత్తి పంట వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన నిజాంపేట మండలకేంద్రంలో పలు విత్తన, ఫెర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయాధికారి సతీశ్తోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా పత్తిని వేసుకోవాలని సూచించారు. మరో రెండ్రోజుల్లో నిజాంపేట ఆగ్రోస్ […]