సారథి న్యూస్, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల కోసం అధిక నిధులు మంజూరు చేసిందని చెప్పారు. గురువారం యూసుఫ్ గూడ మొదటి బెటాలియన్ లో జరిగిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం చేసిన పరీక్షలో ఆయనకు నెగెటివ్ వచ్చింది. మంత్రితోపాటు ఆయన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం మంత్రికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ‘మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.