ఉజ్జయిని: 60 కేసుల్లో నిందితుడైన వికాస్ దుబేను పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయం బయట అరెస్టు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. వికాస్ దుబే పెద్ద పెద్దగా కేకలు వేశాడు. ‘నేను వికాస్ దుబేను.. కాన్పూర్ వాలాను’ అంటూ పోలీసుల ముందు అరిచాడు. వికాస్‌ను పోలీసులు కారులోకి ఎక్కిస్తుండగా అతడు కేకలు వేసిన వీడియోలు బయటికి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో దగ్గర ఒక షాప్‌లో పూజ సామగ్రి కొన్న దుబేను ఆ షాప్ […]
భోపాల్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్ కొలువుదీరింది. మంత్రులుగా నియమితులైన 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అడిషనల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ ఎమ్మెల్యే, సింధియా అత్త అయిన యశోదారాజ్ సింధియాకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమర్తీదేవి, ప్రభురామ్ చౌధురి, ప్రధుమన్ సింగ్ థోమర్ కూడా […]
భోపాల్: ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ ప్రొఫైల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరిన సింధియా తన ట్వీట్టర్ ప్రొఫైల్‌లో బీజేపీ పేరును తొలగించారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో ‘పబ్లిక్ సర్వెంట్, క్రికెట్ ఇష్టం’ అని మాత్రమే ఉంది. అయితే శివరాజ్‌సింగ్ చౌహాన్ టీమ్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయని, అందుకే ఆయన పార్టీ పేరును తొలగించారనే రూమర్స్ వస్తున్నాయి. కాగా ఆ వార్తలను సింధియా ఖండించారు. అయితే […]