సారథి న్యూస్, కర్నూలు: మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ లో బీఆర్కే ఫౌండేషన్, లయన్స్క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ, ఆనంద్ రావు, అడ్వకేట్ బొల్లెద్దుల సాయిపవన్ కాంత్, మాజీ కార్పొరేటర్ నాగన్న, సత్యం, రాజశేఖర్ పాల్గొన్నారు.