సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ లో పత్తి పంటను మిడతలు ఆశించిన నేపథ్యంలో సంగారెడ్డి డాట్ సెంటర్ సైంటిస్ట్ డాక్టర్ రాహుల్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. మిడతలు ఆశించిన నడిపోల్లా బాలయ్య పత్తి పంటను పరిశీలించారు. ఈ మిడతలు దండు స్వభావం కలిగినవి, కొన్ని మొక్కలను మాత్రమే ఆశిస్తాయని ఆయన తెలిపారు. ఈ రకం మిడతలు ముందుగా పొలం గట్టు మీద గుడ్లు పెట్టి పదిరోజుల తర్వాత పిల్లలై మొక్కలను ఆశిస్తాయని […]
మన పంటలకూ కీటకాల ముప్పు ఏపీలోని అనకాపల్లిలో పంటలపై దాడి సారథి న్యూస్, హైదరాబాద్, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలకు మరో ఆపద పొంచి ఉంది.. గంటకు 15కి.మీ వేగంతో మిడతల దండు దూసుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి కదిలిన లక్షలాది మిడతలు పంటలపై దాడిచేసి దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలను తినేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి […]