Breaking News

LAW STUDENT

న్యాయవిద్యార్థి గంజాయి దందా

ఇబ్రహీంపట్నం రూరల్‌: న్యాయ విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థి గంజాయి కేసులో పట్టుబడ్డాడు. అతడికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆరునెలల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. కరీంనగర్‌ జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామానికి చెందిన సాయిని అరవింద్‌ హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో న్యాయవాద విద్య మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలం క్రితం అరవింద్‌ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు.

Read More