సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు ఏకకాలంలో పూర్తయి వెంటనే వారికి పాస్ పుస్తకంలో భూమి వివరాలు నమోదవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హన్మంత్రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్ఆఫీసులో ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలుదారులతో పాటు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ అయిన కొద్ది సమయంలోనే […]