సారథిన్యూస్, కొత్తగూడెం: బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్, కేక్ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్‌రెడ్డి, నాయకులు, […]