Breaking News

KOILSAGAR

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

సారథి న్యూస్​, దేవరకద్ర: కొత్తకోట మండలం కనిమెట్ట– జంగమాయపల్లి గ్రామాల బ్రిడ్జిని మంజూరుచేసి వెంటనే పనులు మొదలుపెట్టాలని మంత్రి హరీశ్​రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును మంజూరుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి […]

Read More
కోయిల్ సాగర్ కు పోటెత్తిన వరద

కోయిల్ సాగర్ కు పోటెత్తిన వరద

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు మంగళవారం వరద నీరు పోటెత్తింది. దీంతో నాలుగు షట్టర్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజులుగా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యానికి మించి చేరడంతో గేట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు.

Read More
కోయిల్​సాగర్​ ఐదుగేట్ల ఎత్తివేత

కోయిల్​సాగర్​ ఐదుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు గురువారం భారీ వరద నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు షట్టర్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో బుధవారం రాత్రి భారీవర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు వచ్చే కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ముందస్తు చర్యగా అధికారులు ప్రాజెక్టు […]

Read More
పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]

Read More
కోయిల్​సాగర్​నుంచి నీటివిడుదల

కోయిల్​సాగర్ ​నుంచి నీటి పరవళ్లు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ సాగునీటి పారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ ఐదు షట్టర్లను ఆదివారం తెరిచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. పెద్దఎత్తున ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు ఉండగా, ప్రస్తుతం 32 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టుకు కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వరద వచ్చి […]

Read More
కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి […]

Read More
నిండుకుండలా కోయిల్ సాగర్

నిండుకుండలా కోయిల్ సాగర్

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్​సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి […]

Read More

కోయిల్​సాగర్​ ఎత్తు పెంచుతాం

ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని మంత్రి డాక్టర్​ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఎత్తు పెంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూర్ శివారులోని వాగుపై సుమారు రూ.ఏడుకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]

Read More